B Cherlapalli: పెద్దారవీడు మండలంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

B Cherlapalli: ప్రకాశం జిల్లా లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 July 2026 8:46 AM IST
B Cherlapalli
X

B Cherlapalli: పెద్దారవీడు మండలంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

B Cherlapalli: పెద్దారవీడు మండలం బి.చెర్లపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జయంతి వేడుకలను జరుపుతూ మిఠాయిలు పంచి వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాడుగుల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మూల లక్ష్మీ రెడ్డి, సీనియర్ నాయకులు మూల రామకోటిరెడ్డి, కర్ర శ్రీనివాసరెడ్డి, చిట్యాల రమణారెడ్డి, మూల లక్ష్మీనారాయణ రెడ్డి, కాసు వెంకటేశ్వర్ రెడ్డి,చిట్యాల వెంకటేశ్వర రెడ్డి, గుమ్మ శ్రీరాములు ,మండల సోషల్ మీడియా వింగ్ సెక్రెటరీ కోటపాటి శ్రీనివాసులు,

కోటపాటి వెంకటేశ్వర్లు, జడ్డా అబ్రహం, జడ్డా ప్రేమయ్య, జడ్డా గురువులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story