Yerragondapalem: వెలిగొండ కెనాల్‌లో యువకుల గల్లంతు.. అధికారుల తీరుపై ఆగ్రహం!
Yerragondapalem: వెలిగొండ ప్రాజెక్టు గంటవానిపల్లి ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన యువకుల మృతదేహాల వెలికితీతలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటూ కటకానిపల్లి గ్రామస్థులు, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yerragondapalem: వెలిగొండ కెనాల్‌లో యువకుల గల్లంతు.. అధికారుల తీరుపై ఆగ్రహం!
Yerragondapalem: వెలిగొండ ప్రాజెక్టు గంటవానిపల్లి ఫీడర్ కెనాల్‌లో గల్లంతైన పెద్ద దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన యువకుల మృతదేహాల వెలికితీత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువకులు గల్లంతై 48 గంటలు గడుస్తున్నా.. మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కెనాల్‌లో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని యువత గుర్తించి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. సిబ్బంది పట్టించుకోలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్లముందే మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నా అధికారులు స్పందించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మండిపడుతున్నారు.
ఘటన జరిగినప్పటి నుంచి బాధిత కుటుంబాల వద్దకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పరిస్థితిని తెలుసుకోకపోవడంపై కూడా యువత, గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని గాలింపు చర్యలను వేగవంతం చేయాలని.. మృతదేహాలను త్వరితగతిన వెలికితీసి బాధిత కుటుంబాలకు అప్పగించాలని యువత, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.




