Markapuram: గొల్లపల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏరిక్షన్ బాబు
Markapuram: ప్రమాదవశాత్తు మృతి చెందిన తిరుమలబాబు కుటుంబాన్ని పరామర్శించిన యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు. రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత.
Markapuram: గొల్లపల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏరిక్షన్ బాబు
మార్కాపురం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పలపాటి తిరుమలబాబు ప్రమాదవశాత్తు మృతి చెందిన నేపథ్యంలో, యర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మానవతా దృక్పథంతో తన వంతు సహాయంగా రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి విషాద ఘటనలు బాధాకరమని పేర్కొన్న గూడూరి ఏరిక్షన్ బాబు, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.
Next Story




