Yerragondapalem: తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎద్దుల పందేలు

Yerragondapalem: పెద్దారవీడు మండలం రాజంపల్లిలో శ్రీ గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 July 2026 6:54 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎద్దుల పందేలు

Yerragondapalem: పెద్దారవీడు మండలం చట్లమిట్ట పంచాయతీ పరిధిలోని రాజంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సందడి మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శనలు, సంప్రదాయ ఎద్దుల పందేలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసులరెడ్డి, మండల సీనియర్ నాయకులు దుగ్గెంపూడి కొండారెడ్డి, నియోజకవర్గ యువజన నాయకుడు ఆనెకార్ల శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఇటువంటి ఉత్సవాలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. పశుసంపద రైతుకు వెన్నెముక వంటిదని, పశు ప్రదర్శనల ద్వారా ఉత్తమ జాతుల పశువుల పెంపకంపై రైతులకు అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. సంప్రదాయ ఎద్దుల పందేలు గ్రామీణ క్రీడా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన అన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story