Yerragondapalem: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎరిక్షన్ బాబు
Yerragondapalem: యర్రగొండపాలెం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ.
Yerragondapalem: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎరిక్షన్ బాబు
Yerragondapalem: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు రూ.36,93,032 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను టిడిపి ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు.
వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు చికిత్సకు సంబంధించిన వివరాలను సమర్పించి ఆర్థిక సహాయం కోరగా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 29 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.36,93,032 విలువైన చెక్కులు అందజేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు అందిన సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు సహకరించిన ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.




