Yerragondapalem: ఓటర్ల జాబితా సవరణ: తహసీల్దార్‌ జయలక్ష్మి ప్రకటన!

Yerragondapalem: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ సర్వే అనంతరం ఓటర్ల సంఖ్య 1,90,530కి చేరిందని తహసీల్దార్‌ ఎన్. జయలక్ష్మి తెలిపారు.

Srikanth Singam, Markapur
Published on: 20 Aug 2026 4:35 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఓటర్ల జాబితా సవరణ: తహసీల్దార్‌ జయలక్ష్మి ప్రకటన!

ఎర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ముందు 2,08,318 మంది ఓటర్లు ఉండగా, సర్వే అనంతరం 1,90,530 మంది ఓటర్లు ఉన్నట్లు నియోజకవర్గ ప్రధాన కేంద్రం తహసీల్దార్‌ ఎన్. జయలక్ష్మి తెలిపారు.

నియోజకవర్గ పరిధిలోని పెద్ద దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం ఐదు మండలాల్లో నిర్వహించిన సర్వేలో 4,484 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 4,415 మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. తరలివెళ్లిన వారిలో 2,225 మంది ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా 6,665 మంది ఓటర్లు విచారణకు హాజరు కాలేదని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా మొత్తం 1,10,281 మంది ఓటర్లకు నోటీసులు అందజేసినట్లు తహసీల్దార్‌ ఎన్. జయలక్ష్మి వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు నేటి నుంచి వచ్చే నెల 21వ తేదీలోపు విడతలవారీగా విచారణ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఓటర్లు తమకు అందిన నోటీసుల మేరకు విచారణకు హాజరై అవసరమైన ఆధారాలను సమర్పించాలని సూచించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story