Yerragondapalem: అభివృద్ధి పరుగులు.. రూ.14 కోట్ల పనులకు శ్రీకారం!

Yerragondapalem: యర్రగొండపాలెం నియోజకవర్గంలో రూ.14 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గూడూరి ఎరిక్షన్ బాబు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Sept 2026 11:50 AM IST
Yerragondapalem
X

Yerragondapalem: అభివృద్ధి పరుగులు.. రూ.14 కోట్ల పనులకు శ్రీకారం!

Yerragondapalem: యర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

పెద్దారవీడు మండలంలో బి.చెర్లొపల్లి అప్రోచ్ సీసీ రోడ్డుకు రూ.50 లక్షలు, బి.చెర్లొపల్లి–చట్లమిట్ట బీటీ రోడ్డుకు రూ.3.70 కోట్లు, రేగుమానుపల్లి–పోతంపల్లి బీటీ రోడ్డుకు రూ.2.59 కోట్లతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.

త్రిపురాంతకం మండలంలో నడిగడ్డ బీటీ రోడ్డును రూ.1.28 కోట్లతో ప్రారంభించగా, నడిగడ్డ మీదుగా గురిజేపల్లి వరకు బీటీ రోడ్డుకు రూ.4.35 కోట్లతో శంకుస్థాపన చేశారు. మిరియంపల్లి గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి, బీటీ రోడ్డు పనులను రూ.2.70 కోట్లతో ప్రారంభించారు. అదేవిధంగా రూ.2.06 కోట్లతో నిర్మించిన నూతన కేజీబీవీ పాఠశాల భవనాన్ని ప్రారంభించారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, మండల టిడిపి సీనియర్ నాయకులు దుగ్గెంపూడి కొండారెడ్డి,బి.చెర్లొపల్లి మాజీ సర్పంచ్ ఆకుమళ్ల శ్రీనివాసరెడ్డి, డీలర్ బొచ్చు వెంకటేశ్వరరెడ్డి, కర్ర శ్రీకాంత్ రెడ్డి, కర్ర నాగిరెడ్డి ,మండల బీసీ సెల్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, పేర్ రెడ్డి పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM