Yerragondapalem: 70 మందికి రూ.1.42 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Yerragondapalem: ఎర్రగొండపాలెంలో 70 మంది లబ్ధిదారులకు రూ.1.42 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.

Srikanth Singam, Markapur
Published on: 14 Aug 2026 2:15 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: 70 మందికి రూ.1.42 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 42 లక్షల 90 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే ఈ నెలాఖరులో ప్రాజెక్టును ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రతి టీడీపీ కార్యకర్త పార్టీకి కృతజ్ఞతతో పనిచేయాలని కోరారు.

కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ చిట్యాల వెంగల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story