Markapuram: ప్రపంచ సికిల్ సెల్ అనీమియా అవగాహన దినోత్సవం
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమెట్ల పీహెచ్‌సీలో సికిల్ సెల్ అనీమియా అవగాహన దినోత్సవం.
Markapuram: ప్రపంచ సికిల్ సెల్ అనీమియా అవగాహన దినోత్సవం
Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమెట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సికిల్ సెల్ అనీమియా అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా DLTAO మరియు DMO డాక్టర్ కె. రాహుల్, ITDA డిప్యూటీ DM&HO డాక్టర్ రవి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కె. రాహుల్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి అని, దీనిని ముందస్తు పరీక్షల ద్వారా గుర్తించి తగిన మందులు వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా మందులు అందజేస్తుందని పేర్కొన్నారు.
ITDA డిప్యూటీ DM&HO డాక్టర్ రవి మాట్లాడుతూ ఈ వ్యాధి ప్రధానంగా గిరిజన సమాజంలో ఎక్కువగా గుర్తించబడుతున్నదని, ముందస్తుగా పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి ప్రభావాన్ని తగ్గించవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఎన్. భరత్ కుమార్, CHOలు, ANMలు, హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




