Markapuram: నాలుగు జిల్లాల ప్రగతికి ‘వెలిగొండ’ మైలురాయి!
Markapuram: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కరవు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి తెలిపారు.
Markapuram: నాలుగు జిల్లాల ప్రగతికి ‘వెలిగొండ’ మైలురాయి!
మార్కాపురం: మార్కాపురం జిల్లా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కరవు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు నాలుగు జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.
కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తోందని, ప్రాజెక్టు పూర్తితో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Next Story




