Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌కు యూనియన్ బ్యాంక్ కంప్యూటర్లు

Markapuram: యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మార్కాపురం కలెక్టరేట్‌కు 7 కంప్యూటర్ల అందజేత. కలెక్టరేట్‌లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు బ్యాంక్ సహకారంపై కలెక్టర్ హర్షం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 11 July 2026 2:53 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌కు యూనియన్ బ్యాంక్ కంప్యూటర్లు

మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో 7 నూతన కంప్యూటర్లను శనివారం అందజేశారు. డీజీఎం వి. రవికుమార్, ఎల్‌డీఎం షాహీర్, మార్కాపురం బ్రాంచ్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులకు అందించారు.

ఈ సందర్భంగా బ్యాంకు అధికారులను కలెక్టర్ అభినందించారు. అలాగే కలెక్టరేట్‌లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు యూనియన్ బ్యాంక్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తూ, వచ్చే వారం దానిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story