Tripuranthakam: కేజీబీవీ పాఠశాలలో ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

Tripuranthakam: త్రిపురాంతకం కేజీబీవీ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 7 Sept 2026 8:27 PM IST
Tripuranthakam
X

Tripuranthakam: కేజీబీవీ పాఠశాలలో ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

త్రిపురాంతకం: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురుకులంలో విద్యార్థులకు అందుతున్న భోజనం, ఆహార నాణ్యత, వంటశాల పరిసరాలను పరిశీలించారు.

విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, నిల్వలు, వంట విధానంపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం ఎలా ఉంటోంది..? నాణ్యమైన ఆహారం అందుతున్నదా..? భోజనంలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా..? అనే విషయాలను అడిగి తెలుసు కున్నారు.

వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచనలు చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కొర్ర తులసి మల్లికార్జున్ నాయక్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story