Singarayakonda: తౌషిక్ మృతి కేసులో తీవ్ర విషాదం పోరాటం చేసిన తల్లి మౌలాబి మృతి!

Singarayakonda: కుమారుడు తౌషిక్ మృతిపై న్యాయం కోసం ఏడు నెలలుగా పోరాడుతున్న తల్లి మౌలాబి మృతి.. పాఠశాల వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో విషాదం.

Ram Mohan, Singarayakonda
Published on: 12 Sept 2026 8:53 AM IST
Singarayakonda
X

Singarayakonda: తౌషిక్ మృతి కేసులో తీవ్ర విషాదం పోరాటం చేసిన తల్లి మౌలాబి మృతి!

Singarayakonda: ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడు తౌషిక్ మృతిపై అనుమానాలు నివృత్తి చేసి, న్యాయం చేయాలని గత ఏడు నెలలుగా పోరాడుతున్న తల్లి మౌలాబి మృతి చెందారు. రెండు రోజుల క్రితం స్కూల్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను తొలుత ఒంగోలులో చికిత్స అందించి, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తౌషిక్ ఫిబ్రవరి 14న శ్రీ చైతన్య నవోద కోచింగ్ సెంటర్‌లో మృతి చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు తౌషిక్‌ది ఆత్మహత్యేనని నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పోలీసుల నిర్ధారణపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. తౌషిక్‌ను స్కూల్ యాజమాన్యమే హత్య చేసిందని వారు ఆరోపిస్తూ, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.

తన కుమారుడి మృతికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాలని, అనుమానాలు నివృత్తి చేయాలని మౌలాబి గత ఏడు నెలలుగా నిరసనలు, ఆందోళనలు చేస్తూ వచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుమారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె పట్టుదలగా ఉన్నారని తెలిపారు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్కూల్ వద్ద మౌలాబి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో నిన్న ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మౌలాబి మృతి చెందారు.

కుమారుడి మృతిపై న్యాయం కోసం ఏడు నెలలుగా పోరాడిన తల్లి మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తౌషిక్ మృతి ఘటనపై ఉన్న అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda