Markapuram: మార్కాపురం ప్రజలారా జర భద్రం.. పట్టణంలో దొంగల సంచారం

Markapuram: మార్కాపురం పట్టణంలో దొంగల సంచారం కలకలం రేపుతోంది. దర్శి రామకృష్ణ హాస్పిటల్ సమీపంలో దొంగలు బీభత్సం సృష్టించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 April 2026 3:00 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం ప్రజలారా జర భద్రం.. పట్టణంలో దొంగల సంచారం

Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో దొంగల సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దర్శి రామకృష్ణ హాస్పిటల్ సమీపంలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడేందుకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఇంటి పరిసరాల్లో అమర్చిన సీసీ కెమెరాలు దొంగల కదలికలను గుర్తించడంతో, వారు వెంటనే కెమెరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అప్పటికే కొన్ని దృశ్యాలు రికార్డు కావడంతో దొంగల సంచారం స్పష్టమైంది.

ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో భద్రత లేకపోవడంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దొంగలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే పట్టణంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు మరింత పెంచుతున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story