Prakasam: నూజిళ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఇరువర్గాల వివాదం!
Prakasam: జె. పంగులూరు మండలం నూజిళ్లపల్లిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Prakasam: నూజిళ్లపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఇరువర్గాల వివాదం!
Prakasam: జె పంగులూరు మండలం నూజిళ్ళపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కాలనీవాసులు చందాలు వేసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కొనుగోలు చేశారు. ఆ విగ్రహం కాలనీలో ప్రధాన రహదారి భాగంలో ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు అడ్డగించడంతో ఉద్రుక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం అందుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ అడ్డగించారు. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహంను ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేసిన పోలీసులు అడ్డు వచ్చిన మహిళలను కొందరు యువకులను పోలీసు వాహనాలలో స్టేషన్కు తరలించారు.
నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాలనీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులు అడ్డగించడం ఎంతవరకు సమంజసం అని స్థానిక ఎస్సీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.




