Yerragondapalem: యర్రగొండపాలెం తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం
Yerragondapalem: యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఎగువ చెర్లపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను 24 గంటల్లోనే నెరవేర్చారు.
Yerragondapalem: యర్రగొండపాలెం తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం
Yerragondapalem: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రజా సమస్యలపై తన చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. దోర్నాల మండలం చిలకచర్ల గ్రామ పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో ఎగువ చెర్లపల్లి గ్రామ మహిళలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
“రేపు ఉదయాన్నే బోరు బండి పంపించి గ్రామం మొత్తానికి నీళ్లు అందిస్తాను.. అది నా బాధ్యత” అని హామీ ఇచ్చిన గూడూరి ఎరిక్షన్ బాబు, చెప్పిన మాట ప్రకారం 24 గంటల్లోనే బోరు వేయించి గ్రామ ప్రజల దాహార్తిని తీర్చారు.
తక్షణ స్పందనతో గ్రామానికి నీటి సౌకర్యం కల్పించడంతో మహిళలు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ గూడూరి ఎరిక్షన్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ, సమస్యలు చెప్పగానే స్పందించే నాయకుడు గూడూరి ఎరిక్షన్ బాబు అని గ్రామస్తులు ప్రశంసించారు.
గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యను వేగంగా పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




