Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఓటర్ల ప్రత్యేక శిబిరాలు!
Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఓటర్ల ప్రత్యేక శిబిరాలు సవరణలు, చేర్పులకు అవకాశం అని తెలిపిన తహసీల్దార్ జయలక్ష్మి
Yerragondapalem: ఎర్రగొండపాలెంలో ఈ నెల 5, 6 తేదీల్లో ఓటర్ల ప్రత్యేక శిబిరాలు!
Yerragondapalem: ఎర్రగొండపాలెంఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 5, 6 తేదీల్లో శని ఆది, వారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎర్రగొండపాలెం తహసీల్దార్ జయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన చేర్పులు, మార్పులు, సవరణలు చేసుకునేందుకు ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్న వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఓటరుగా నమోదై ఉన్నవారి పేర్లు, ఇంటి చిరునామా, ఇంటిపేరు, ఇతర వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని వెల్లడించారు.
అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మారిన వారు తమ ప్రస్తుత చిరునామాను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటు వంటి అంశాలపై కూడా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అధికారులు ఇప్పటికే ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో, ప్రజలు తమ ఓటు వివరాలను స్వయంగా పరిశీలించుకుని అవసరమైన సవరణలు ఉంటే ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ జయలక్ష్మి కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవడంతో పాటు, నమోదైన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ప్రతి ఓటరు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.




