Markapuram: శ్రీశైలం వెళ్లే భక్తుల భద్రతకు పోలీసుల భరోసా

Markapuram: మార్కాపురం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పెద్ద దోర్నాల నల్లమల ఘాట్ రోడ్డులో పోలీసులు కన్వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 April 2026 3:45 PM IST
Markapuram
X

Markapuram: శ్రీశైలం వెళ్లే భక్తుల భద్రతకు పోలీసుల భరోసా

Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల నల్లమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఘాట్ రోడ్డులో ప్రమాదకర మలుపుల వద్ద కన్వెక్స్ మిర్రర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు మార్కాపురం డిఎస్పి నాగరాజు, ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టినట్లు డిఎస్పి నాగరాజు తెలిపారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డులోని మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేందుకు రోడ్డుకు ఇరువైపులా కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అద్దాల ద్వారా వాహనదారులు ముందుగానే ఎదురుగా వచ్చే వాహనాలను గమనించి అప్రమత్తంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద దోర్నాల ఎస్సై వెంకటరమణయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story