Singarayakonda: గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: సీఐ శ్రీహరి
Singarayakonda: సింగరాయకొండలో వినాయక చవితికి కఠిన నిబంధనలు. మండపాలకు సింగిల్ విండో పర్మిషన్ తప్పనిసరి, డీజేలకు అనుమతి లేదని సీఐ శ్రీహరి స్పష్టం.
Singarayakonda: గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: సీఐ శ్రీహరి
Singarayakonda: సింగరాయకొండ మండల సర్కిల్ పరిధిలో వినాయక చవితి పండగ సందర్భంగా సి ఐ. శ్రీహరి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి అనేది ఆధ్యాత్మిక పండగని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు.
ఈ సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహ కమిటీ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ పొందాలని సూచించారు.
మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు సింగల్ విండో విధానం ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉత్సవాలు జరిగే సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు మండపాలు దగ్గర జరుపుకునే వాళ్లు డీఎస్పీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఊరేగింపు సమయాలలో విగ్రహాల దగ్గర డీజే పర్మిషన్ ఉండకూడదని తెలిపారు. మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఉత్సవ కమిటీ దే బాధ్యతని తెలిపారు.




