Markapuram: జిల్లా సంక్షేమ పథకాల అమలుపై ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆరా

Markapuram: మార్కాపురం జిల్లా పర్యటనలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌తో జిల్లా కలెక్టర్ మరియు టీడీపీ నేతల భేటీ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 April 2026 10:57 AM IST
Markapuram
X

Markapuram: జిల్లా సంక్షేమ పథకాల అమలుపై ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆరా

Markapuram: మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా రాయవరం వెలుగొండ ప్రాజెక్ట్ అతిథి గృహంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను జిల్లా కలెక్టర్ విజయ సునీత, టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు తదితర అంశాలను కలెక్టర్ చైర్మన్‌కు వివరించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ భేటీలో కమిషన్ సభ్యులు డాక్టర్ గౌతమ్ రాజు, రామాంజనమ్మ కూడా పాల్గొన్నారు. జిల్లాలోని పరిస్థితులపై సమగ్ర నివేదికను అందజేసిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలపై చైర్మన్‌తో చర్చించారు.

టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వేగంగా పరిష్కరించేలా కమిషన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా అభివృద్ధి, సామాజిక న్యాయం అమలులో సమన్వయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, ఎస్సీ కమిషన్ సభ్యులు గౌతమ్ రాజు, రామాంజమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణ్ నాయక్, డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story