Markapuram: ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే నీళ్లు వదలాలి

Markapuram: ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసం కల్పించిన తర్వాతే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Rohith
Published on: 14 Aug 2026 6:24 PM IST
Markapuram
X

Markapuram: ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేసిన తర్వాతే నీళ్లు వదలాలి

మార్కాపురం: ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన తర్వాతే నీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

మార్కాపురం పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1996లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 2026లో ప్రారంభం కావడం సంతోషకరమేనన్నారు. అయితే ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, జీవనాధారాలను త్యాగం చేసిన నిర్వాసితులను వెంటనే ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

చట్టప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేసి, కనీసం ఆరు నెలల సమయం ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు ప్యాకేజీ అందించాలని, ప్రతి నిర్వాసితుడికి పట్టాలు ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

నిర్వాసితులకు సమయం ఇచ్చి, వారి సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టులో నీటిని విడుదల చేయాలని జంకె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల త్యాగాలను గుర్తించి మానవత్వంతో వ్యవహరించాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ధర్మానాయక్, గౌస్ మొహిద్దిన్, మాలకొండయ్యతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Rohith

Rohith

Next Story