Singarayakonda: చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి మృతిపై శాంతియుత ర్యాలీ!
Singarayakonda: సింగరాయకొండ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతిపై ర్యాలీ.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల డిమాండ్.
Singarayakonda: చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి మృతిపై శాంతియుత ర్యాలీ!
Singarayakonda: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమానాస్పద మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అండగా నిలిచి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థి తల్లి మౌలాబీ న్యాయం కోసం ఆరు నెలలుగా పోరాడుతున్న నేపథ్యంలో ఆమెకు మద్దతుగా ప్రజా సంఘాలు, మైనారిటీ నాయకులు పాకల రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ కేంద్రంలో విద్యార్థి మృతి చెంది ఆరు నెలలు గడుస్తున్న విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు.
విద్యార్థి మృతికి దారి తీసిన కారణాలను పూర్తిగా వెలుగులోకి తీసుకొని వచ్చి బాధ్యులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఘటన జరిగినప్పటికీ బాధిత కుటుంబాన్ని పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
విద్యార్థి తల్లి మౌలాబి చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. న్యాయం జరిగే వరకూ విద్యార్థి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
బైట్: సి ఐ టి యు ప్రకాశం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు




