Markapuram: మార్కాపురం జనగణన ప్రాధాన్యతను చాటిచెప్పిన 5కే రన్!

Markapuram: మార్కాపురంలో స్వీయ జనగణనపై అవగాహన కోసం ఘనంగా 5కే రన్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 April 2026 11:13 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జనగణన ప్రాధాన్యతను చాటిచెప్పిన 5కే రన్!

మార్కాపురం జిల్లా: కేంద్రంలో స్వీయ జనగణన (Self Enumeration) పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా 5కే రన్ నిర్వహించారు. పట్టణంలోని సప్తగిరి లాడ్జి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. స్వీయ జనగణన దేశాభివృద్ధికి కీలకమని, ప్రతి పౌరుడు దీనిలో చురుకుగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుతుందని తెలిపారు.

ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలకు స్వీయ జనగణన ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు. యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు, తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ 5కే రన్ ప్రజల్లో స్వీయ జనగణనపై అవగాహన పెంచడంలో ముఖ్యపాత్ర పోషించింది అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story