Markapuram: మార్కాపురంలో ప్రైసెల్ వరల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ తొలి వార్షికోత్సవం!
Markapuram: మార్కాపురంలో ఘనంగా ప్రైసెల్ వరల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ తొలి వార్షికోత్సవం ప్రశంసించిన పలువురు ప్రముఖులు.
Markapuram: మార్కాపురంలో ప్రైసెల్ వరల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ తొలి వార్షికోత్సవం!
Markapuram: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రైసెల్ వరల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి విద్యానికేతన్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ కె. రంగయ్య, జిల్లా మెంటల్ హెల్త్ కౌన్సెలర్ లావణ్య నారాయణం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కె. రంగయ్య మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం సాధించాలంటే నిరంతర సాధన అవసరమని అన్నారు. విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధికి ప్రైసెల్ అకాడమీ డైరెక్టర్ పీటర్ రాక్ చేస్తున్న కృషిని అభినందించారు.
లావణ్య నారాయణం మాట్లాడుతూ.. భాష నేర్చుకోవడానికి విద్యార్హతలు అడ్డంకి కాదని, మార్కాపురంలో అందుబాటులో ఉన్న ప్రైసెల్ వరల్డ్ శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీటర్ రాక్ కృషిని ప్రశంసించారు.
అనంతరం ముఖ్య అతిథులను పీటర్ రాక్, అకాడమీ మేనేజర్ జి. ఆనంద్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు 15 మంది నార్త్ ఈస్ట్ ట్రైనర్లకు, 50 మంది విద్యార్థులకు శిక్షణ అందించినట్లు పీటర్ రాక్ తెలిపారు. యువతకు మెరుగైన ఉద్యోగ, కెరీర్ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతుల పంపిణీ, కేక్ కటింగ్, విద్యార్థుల అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.




