Tokapalli: రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్.. తోకపల్లి విద్యార్థి ప్రవీణ్

Tokapalli: రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన ప్రవీణ్ కుమార్‌ను యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఘనంగా సన్మానించారు.

Venkata Thirumala
Published on: 2 May 2026 3:08 PM IST
Tokapalli
X

Tokapalli: రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్.. తోకపల్లి విద్యార్థి ప్రవీణ్

మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామానికి చెందిన ప్రతిభావంతుడు ఉప్పలపాటి ప్రవీణ్ కుమార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం పొందాడు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రవీణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అతని ప్రతిభను గుర్తిస్తూ రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ప్రతిభను ప్రోత్సహించడం మరియు విద్యార్థులకు అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు సాధించే విద్యార్థులు మరింత ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకుడు అనిల్ కుమార్ మరియు మండల టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story