Yerragondapalem: తిమ్మాపురంలో వినాయక ప్రతిమ ఏర్పాటుకు ఆర్థిక సహాయం!

Yerragondapalem: యర్రగొండపాలెం తిమ్మాపురంలో వినాయక చవితి ఉత్సవాల కోసం వైఎస్సార్‌సీపీ నేత షేక్ షేక్షావలి రూ. 10,000 ఆర్థిక సాయం అందించగా యువత అభినందించారు.

Srikanth Singam, Markapur
Published on: 5 Sept 2026 12:07 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: తిమ్మాపురంలో వినాయక ప్రతిమ ఏర్పాటుకు ఆర్థిక సహాయం!

Yerragondapalem: రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విగ్నేశ్వరుని ప్రతిమను ప్రతిష్టించేందుకు స్థానిక యువత సన్నాహాలు ప్రారంభించారు. ప్రతిమ ఏర్పాటుకు కావాల్సిన నిధుల సేకరణలో భాగంగా, పెద్దదోర్నాల సేఫ్టీ డ్రైవర్స్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి టీఎన్టియుసి అధ్యక్షులు షేక్ షేక్షావలి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన షేక్షావలి సమాజంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో ముందుకు రావాలి. ఇలాంటి శుభకార్యాలకు సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు,

ఈ సందర్భంలో పీర్ల చావిడి బజార్ యువత ప్రత్యేకంగా అభినందిస్తూ కుల మతాలకు అతీతంగా సోదర భావంతో ఆర్థిక సహాయం అందించిన షేక్ షేక్షావలి నిజమైన ప్రజాసేవకుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకీ, మహబూభాష, శీను, మస్తాన్, ఆదిత్య, అజయ్, కాశిరావు, అశోకు, కౌశిక్ రామకృష్ణ అల్లూరయ్య, తదితరులు పాల్గొని సహకరించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story