Ongole: ఒంగోలులో చడ్డీ గ్యాంగ్ కలకలం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కీలక ప్రకటన

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో చడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు.

SHOWRY, ONGOLE
Published on: 23 May 2026 12:05 PM IST
Ongole
X

Ongole: ఒంగోలులో చడ్డీ గ్యాంగ్ కలకలం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కీలక ప్రకటన

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చడ్డీ గ్యాంగ్ సంచారం జరుగుతోందన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఓ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశామని అన్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సుమారు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ ముఠా నగరంలోకి ప్రవేశించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అయితే వారు చడ్డీ గ్యాంగ్ కే చెందినవారనే స్పష్టమైన ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని చెప్పారు.

సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచినట్లు ఎస్పీ వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యమైన కూడళ్లు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పారు.

సీసీటీవీ ఫుటేజ్‌ను సాంకేతిక నిపుణులతో విశ్లేషిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా ఎస్పీ. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

SHOWRY, ONGOLE

SHOWRY, ONGOLE

Next Story