Prakasam: అద్దంకి రోడ్డు ప్రమాద ఘటన పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద పోలీసు వాహన ప్రమాదం కేసులో ఎస్పీ చర్యలు. సంతమాగులూరు ఎస్సై విఆర్‌కు బదిలీ, సీఐ, డీఎస్పీలకు మెమోలు, నోటీసులు జారీ.

Kolla Singaiah, Addanki
Published on: 22 Aug 2026 9:47 AM IST
Prakasam
X

Prakasam: అద్దంకి రోడ్డు ప్రమాద ఘటన పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

Prakasam: అద్దంకి మండలంలో ని శంఖవరపాడు గ్రామం వద్ద ఈనెల 16న బైకును తప్పించబోయి ఆటోను ఢీ కొట్టిన కారు , సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటనపై జిల్లా పోలీసు శాఖ , చర్యలు చేపట్టింది. సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ను వి ఆర్ కి బదిలీ చేస్తూ ఉత్తరోలు జారీ చేసింది. బల్లికురవ ఎస్సై నాగరాజు పై చార్జీ మెమో , సంతమాగులూరు సీఐ శేషగిరి పై చార్జి మెమో , దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ పై షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఓ నిందితుడు నుండి గంజాయి స్వాధీనం చేసుకుని నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ఈ చర్యలు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి , ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కలిసి బల్లికురవ ఈర్ల గంగమ్మ గుడి ప్రాంతాల్లో , సంతమాగులూరు పోలీస్స్టేషన్లో సందర్శించి విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమై సొంత వాహనంలో గంజాయి తరలించడంపై సదరు పోలీసులను పై ఉన్నతాధికారులు వివరణ కోరారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story