Addanki: అద్దంకిలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ తీరుపై ఎన్టీఆర్ నగర్ వాసుల నిరసన

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ చింతలపూడి అశోక్ వ్యాఖ్యలపై నిరసన ర్యాలీ. మా భూముల జోలికి రావద్దంటూ ప్రజల ఆగ్రహం.

Kolla Singaiah, Addanki
Published on: 4 Aug 2026 6:50 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ తీరుపై ఎన్టీఆర్ నగర్ వాసుల నిరసన

అద్దంకి: వైస్సార్ సిపి ఇంచార్జి చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడిన తీరును నిరసిస్తూ ఆయనకు మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని అద్దంకి పట్టణం లోని ఎన్టీఆర్ నగర్ వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు.

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం 20వ వార్డు ఊర చెరువు ఎన్టీఆర్ నగర్ వాసులు 30 సంవత్సరాల రా మేము నివసిస్తున్న మాభూమి జోలికి వైసిపి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ రావద్దు అంటూ వార్డు ప్రజలు ఎన్టీఆర్ నగర్ లోని నామాల విగ్రహాల నుండి పోలేరమ్మ గుడి వరకు నినాదాలతో నిరసన గా ర్యాలీ చేపట్టారు.

పార్టీలకు అతీతంగా కుల మత వర్గ బేధం లేకుండా బడుగు బలహీన వర్గాలు కు, వెనకబడి తరగతులు చెందిన వారందరూ ఊర చెరువు ఎన్టీఆర్ నగర్ లో గత 30 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని ఉంటున్నామన్నారు, గత ప్రభుత్వం రెండు కోట్లతో అభివృద్ధి చేపట్టిందని, నేడు కూటమి ప్రభుత్వం ఐదు కోట్లతో అభివృద్ధి పనుల చేపడుతుందన్నారు. అయితే అద్దంకి వైసిపి ఇన్చార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఎన్టీఆర్ నగర్ ఊర చెరువు పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story