Prakasam: రేణింగవరంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
Prakasam: ప్రకాశం జిల్లా రేణింగవరంలో జరిగిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ రాజాబాబు.
Prakasam: రేణింగవరంలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
ప్రకాశం: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం గ్రామంలో పండుగ వాతావరణంలో ' మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ - 4.0' లో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు.
తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన, కలెక్టర్ రాజాబాబు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్.
పిల్ల సమగ్ర అభివృద్ధి కోసం తల్లిదండ్రులతో ప్రత్యేకంగా పీ.టీ.ఎం. కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రామంలో పీ.ఈ.టీ., హెచ్.ఎం. పోస్టులు, అదనపు గదులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. సాంకేతిక లోపాలు సవరించి అర్హులందరికీ ' తల్లికి వందనం ' ప్రయోజనం దక్కేలా చూడాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశనిచ్చారు.




