Prakasam: సమయపాలన కరువైంది.. సేవలు నిలిచాయి.. సచివాలయాల వద్ద ప్రజల గోస

Prakasam: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు స్వర్ణ గ్రామ సచివాలయంలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 May 2026 12:21 PM IST
Prakasam
X

Prakasam: సమయపాలన కరువైంది.. సేవలు నిలిచాయి.. సచివాలయాల వద్ద ప్రజల గోస

Prakasam: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు స్వర్ణ గ్రామ సచివాలయంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఉదయం 10.40 గంటలు దాటినా సచివాలయం తాళాలు తెరవకపోవడంతో సేవల కోసం వచ్చిన ప్రజలు, సిబ్బంది బయటనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రజలకు సమయానికి సేవలు అందించాల్సిన సచివాలయం వద్ద ఈ తరహా పరిస్థితులు మండలంలో తరచూ కనిపిస్తున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేవరాజు గట్టు పంచాయతీ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనుల కోసం వచ్చిన వృద్ధులు, మహిళలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. సమయపాలన పాటించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story