Addanki: గ్రామంలోనే కలెక్టర్ 'పల్లెనిద్ర'.. అద్దంకిలో ప్రజా సమస్యలపై ఫోకస్!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటన. పల్లెనిద్రలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల పరిశీలన.
Addanki: గ్రామంలోనే కలెక్టర్ 'పల్లెనిద్ర'.. అద్దంకిలో ప్రజా సమస్యలపై ఫోకస్!
ప్రకాశం జిల్లా: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల చెంతకు చేరి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం తో పాటు ప్రభుత్వ సర్వీసెస్, సంక్షేమ పథకాలు సరిగా అమలవుతున్నాయా ప్రజలు సంతృప్తి చెందుతున్నారా? ఇంకా ఏమైనా వారికోసం అధికారులు చేయవలసి ఉందా అనే విషయాన్ని తెలుసుకోగలుగుతున్నామన్నారు.
ప్రతి సోమవారం జిల్లా లో పిజిఆర్ఎస్ తో పాటు ప్రతి నియోజవర్గంలో నాలుగు శుక్రవారాలు స్పెషల్ విజిట్ ఉంటుందని అన్నారు. మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శన పరిశీలించారు. గ్రామస్తులు సమస్య తెలిపిన చెరువును పరిశీలించి, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
మంచినీటి వాటర్ ట్యాంక్ ను సందర్శించి వాటర్ టెస్టింగ్ విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎస్సీ కాలనీ స్మశానవాటికను సందర్శించి త్వరలో చుట్టు ప్రహరీ నిర్మించాలని అధికారులకు హెచ్చరించారు.. ఎస్సీ కాలనీలోని స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించి బి ఎల్ ఓ లకు తగు సూచనలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ రాజాబాబు.




