Chinnipadu: బోగణంపాడు సదస్సులో ఉద్యాన అధికారిణి ధనలక్ష్మి ప్రకటన!
Chinnipadu: పొన్నలూరు మండలంలో జరిగిన పొలం పిలుస్తోంది సదస్సులో ఏఓ వి. రాము జులై 31 లోగా ఐసీఐసీఐ లంబార్డ్ కంపెనీకి పంట బీమా ప్రీమియం చెల్లించాలని రైతులకు సూచించారు.
Chinnipadu: బోగణంపాడు సదస్సులో ఉద్యాన అధికారిణి ధనలక్ష్మి ప్రకటన!
చిన్నిపాడు: పొన్నలూరు మండలంలోని చిన్నిపాడు మరియు బోగణంపాడు గ్రామాలలో వ్యవసాయాధికారి వి రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.మండల వ్యవసాయధికారి మాట్లాడుతూ రాబోయే 2026-27 సీజన్లో యూరియా మరియు డి ఏ పి ఎరువుల విక్రయాలు గురించి ప్రత్యేక ఏ పి ఏ ఐ ఎం ఎస్ యాప్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో వివరించారు.
ఈ విధానం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా కృత్రిమ కొరత లేకుండా, ఎరువుల పక్కదారి మల్లింపు నివారణకు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ తరలింపు,కౌలు రైతులకు నష్టం కలగకుండా ఉండటానిని మరియు యూరియా, డి ఏ పి అవసరానికి మించి వాడకం తగ్గించడానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేసారని మండల వ్యవసాయధికారి తెలియజేసారు. ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు తగ్గడం వలన తక్కువ కాల పరిమితి గల పంటలు వేసుకోవాలని, పంట మార్పిడి చేసుకొని సజ్జ, జొన్న, కొర్ర, రాగి మొదలగు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.
ప్రతి రైతు ఏ పి ఎయిమ్స్ యాప్ లో రైతు నమోదు చేసుకొని యూనిక్యూ నెంబర్ తీసుకొని నమోదు చేసుకోవాలని తెలియజేసారు. ఖరీఫ్ 2026 సీజన్ కి సమబంధించి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం క్రింద పంట రుణాలు పొందని రైతులు వాతావరణ ఆదారిత పంటలకు మీ దగ్గరిలోని మీ సేవా కేంద్రాలలో ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం సమర్మించి బీమా చేయించుకోవాలని తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టం లేదా ఎండిపోయిన నష్ట పరిహారం వస్తుంది అని, కావున రైతులు ఈ నెల జులై 31 లోపల ప్రకాశం జిల్లాలో ఐసీఐ సీఐ లంబార్డ్ కంపెనీ కి ప్రీమియం చెల్లించాలని,,ఒక ఎకరానికి కందికి రూ.430/సజ్జ రూ.156/ ఎర్ర మిరప రూ.4500/ మినుములు రూ 205/ నువ్వులు రూ.150/ ప్రీమియం చెల్లించి జులై 31 లోపల పంటల చేసుకొని, తదుపరి పంట నమోదు చేసుకోవాలని సూచించారు.
తదుపరి చిన్నిపాడు గ్రామంలో వేరుశనగ పంట పరిశీలించి ఇనుప దాతు లోపం నివారణకు ఎకరానికి అన్నబెది 10గ్రామలు మరియు నిమ్మ ఉప్పు 2గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలనీ సూచించారు.,ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారిని బి.ధనలక్ష్మి మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా వచ్చే రాయితీ వివరాలను రైతులకు తెలియజేశారు. డ్రిప్ మరియు స్ప్రింట్లర్లు కావాలనుకునే రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని, సబ్సిడీ వివరాలు తెలియజేశారు. ఎల్ నినో ప్రభావం కి రైతుల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు, దీనికోసం ఉద్యాన పంటలు గల ప్రతి రైతు వారి పొలాలలో నీటి కుంటను తవ్వుకోవాలని సూచించారు,ఈ నీటి కుంటలకు ప్రభుత్వం 50% రాయితీని అందిస్తుందని రైతులకు తెలియజేశారు.
పై కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది డి. మందాకిని, బి. కవిత మరియు రెండు గ్రామాల వ్యవసాయ సిబ్బంది, షేక్,మస్తాన్ బాషా, షేక్. మౌలాలి,బహుళ వ్యవసాయ విస్తరణ అధికారులు షేక్. సమీర్, టి. రోసి రెడ్డి , పశు వైద్య సహాయకురలు షేక్. నూరజహాన్ బోగణంపాడు గ్రామ డెవలప్మెంట్ అధికారి డి. హరి కృష్ణ, నీటి సంఘం అధ్యక్షులు డి. వెంకటేశ్వర్లు మరియు రెండు గ్రామాల గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.




