Podili: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన

Podili: పొదిలిలో చంద్రబాబు 53 రోజుల జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ.

MADARVALI, MARKAPURAM
Published on: 9 Sept 2026 10:17 PM IST
Podili
X

Podili: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - కొవ్వొత్తుల ప్రదర్శన

పొదిలి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచిన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా పొదిలి పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు చంద్రబాబు అరెస్టు ఘటన నాంది పలికిందన్నారు. రాక్షస పాలనను అంతం చేసి సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిపై జరిగిన అక్రమ అరెస్టును ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా, టీడీపీ నాయకులు ముల్లా ఖుద్దూస్, పండు అనిల్, వాకా వెంకటరెడ్డి తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story