Podili: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో శ్రీనివాసరావు

Podili: పొదిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీవో శ్రీనివాసరావు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, పోలింగ్ కేంద్రాల్లో వసతులపై అధికారులకు సూచనలిచ్చారు.

MADARVALI, MARKAPURAM
Published on: 9 Sept 2026 5:25 PM IST
Podili
X

Podili: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో శ్రీనివాసరావు

పొదిలి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీనివాసరావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిధిలోని మల్లవరం, జువ్వలేరు, ఓబులక్కపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను ఆయన సందర్శించి, భద్రతతో పాటు మౌలిక వసతుల పై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఓటర్ల జాబితాల పరిశీలనలో తగిన జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావుతో పాటు మల్లవరం పంచాయతీ కార్యదర్శి మారెళ్ల పద్మ, ఓబులక్కపల్లి పంచాయతీ కార్యదర్శి నక్కా శ్రీను, సంబంధిత గ్రామాల బీఎల్‌వోలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story