Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Aug 2026 11:50 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత, జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులకు వివరించి అర్జీలు సమర్పించారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన కలెక్టర్‌ విజయ సునీత వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందేలా అధికారులు పనిచేయాలని ఆమె ఆమె సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story