Peddaraveedu: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకు తలసేమియా!
Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం వైడిపాడులో ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలకు తలసేమియా సోకింది.
Peddaraveedu: తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకు తలసేమియా!
పెద్దారవీడు: ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులకు తలసేమియా సోకడంతో వైడిపాడు గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుంది. కొటారు శ్యామ్‌కుమార్–యేసు కరుణ దంపతుల ఐదుగురు సంతానంలో ముగ్గురికి ఈ వ్యాధి సోకగా.. ఇప్పటికే పెద్ద కుమార్తె దీప్తిని కోల్పోయారు.
ప్రస్తుతం అనూష (13), హనోక్ (11) తలసేమియాతో బాధపడుతున్నారు. ప్రతి పది రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుండగా.. నెలకు సుమారు రూ.40 వేల వరకు చికిత్స ఖర్చవుతోంది. ఇప్పటివరకు వైద్యానికి రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
బోన్‌మారో మార్పిడితో ప్రాణాలు నిలిచే అవకాశం
వైద్యుల సూచన మేరకు ఇద్దరు పిల్లలకు బోన్‌మారో మార్పిడి చేయాల్సి ఉండగా.. ఒక్కొక్కరికి రూ.30 లక్షలు, మొత్తం రూ.60 లక్షలు అవసరం అవుతున్నాయి. కూలి పనులు చేసుకుంటూ పిల్లల చికిత్స కొనసాగిస్తున్న తల్లిదండ్రులు.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు, సేవా సంస్థలు స్పందించి తమ పిల్లల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
సహాయం చేయదలిచిన వారు:
ఫోన్‌పే: 9381711550
SBI: కొటారు శ్యామ్ కుమార్ – A/c 20376748084
IFSC: SBIN0000750
APGB: కొటారు యేసు కరుణ – A c 581410051366428
IFSC: UBIN0ASCG7999




