Markapuram: దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఓఎస్డీ నవజ్యోత్ ఐపీఎస్ తనిఖీలు!
Markapuram: మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోత్ సింగ్ (ఐపీఎస్) ఆదివారం దోర్నాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు.
Markapuram: దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఓఎస్డీ నవజ్యోత్ ఐపీఎస్ తనిఖీలు!
మార్కాపురం: దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోత్, ఐపీఎస్, మార్కాపురం జిల్లాదోర్నాల లో ఓఎస్డీ నవజ్యోత్, ఐపీఎస్ దోర్నాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగొండ ప్రాజెక్ట్‌ను ఓఎస్డీ సందర్శించి, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి భరత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై వివరాలను పరిశీలించారు.
అనంతరం దోర్నాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి, స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్‌ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహిస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఓఎస్డీ గారు మాట్లాడి, వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పర్యటనలో స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, ప్రాజెక్ట్ భద్రత తదితర అంశాలపై ఓఎస్డీ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి,యు నాగరాజు వైపాలెం సీఐ కె అజయ్ కుమార్ మరియు దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య పాల్గొన్నారు.




