Ongole: ఒంగోలులో దారుణం చెరువు గట్టు వద్ద నవజాత శిశువు విలవిల!
Ongole: ఒంగోలు సమత నగర్ చెరువు కట్ట వద్ద వదిలేసిన నవజాత మగ పసికందు. ఏడుపు విని కాపాడిన స్థానికులు, రిమ్స్ ఆసుపత్రి SNCU వార్డులో అత్యవసర చికిత్స.
Ongole: ఒంగోలులో దారుణం చెరువు గట్టు వద్ద నవజాత శిశువు విలవిల!
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు సమత నగర్ చెరువు కట్ట సమీపంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిన్న జన్మించిన ఒక మగ పసికందును చెరువు గట్టు వద్ద నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లారని ప్రకాశం జిల్లాబాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు ఏడుపు శబ్దం విని గమనించగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని . వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని ఆయన చెప్పారు .
తీవ్ర చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పసికందులో గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడంతో పాటు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో... బాబును అత్యవసరంగా రిమ్స్ ఆసుపత్రిలోని SNCU వార్డుకు తరలించినట్లు ఆయన వెల్లడించారు . ప్రస్తుతం వైద్యులు ఆ నవజాత శిశువుకు చికిత్స అందిస్తున్నారని . పసికందును వదిలివెళ్లిన వారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని దినేష్ కుమార్ తెలిపారు.




