Prakasam: చీమకుర్తి పరిధిలో మద్యం దుకాణాల రెన్యూవల్‌కు అవకాశం!

Prakasam: ఆంధ్రప్రదేశ్ నూతన ఎక్సైజ్ పాలసీ 2026-27 ప్రకారం చీమకుర్తి పరిధిలోని 15 మద్యం దుకాణాల రెన్యూవల్‌కు ఎక్సైజ్ అధికారులు సమీక్ష నిర్వహించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 16 Sept 2026 3:47 PM IST
Prakasam
X

Prakasam: చీమకుర్తి పరిధిలో మద్యం దుకాణాల రెన్యూవల్‌కు అవకాశం!

ప్రకాశం: చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2026-27 నూతన ఎక్సైజ్ పాలసీ మేరకు ఒక సంవత్సరం ప్రస్తుతం ఉన్న మద్యం షాపులను రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం కల్పించి ఉన్నారు.

చీమకుర్తి ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 15 మద్యం షాపులను (రెగ్యులర్ - 13, గౌడ కులస్తులకు కేటాయింపు చేసిన - 02షాపులు) రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది.

ఈ రోజు ప్రకాశం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ గారైన హేమంత్ నాగరాజు గారు మరియు ఒంగోలు డిస్ట్రిక్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి అయిన Sk ఆయుష బేగం చీమకుర్తి ఎక్సైజ్ స్టేషన్ నందు మద్యం షాపుల యాజమానులందరితో మీటింగ్ పెట్టి మద్యం షాపులు అన్ని రెన్యువల్ చేసుకోవలసినదిగా మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam