Markapur: కేసుల భారం తగ్గడమే టార్గెట్.. మార్కాపురంలో కొత్త కోర్టు ప్రారంభం!
Markapur: మార్కాపురంలో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
Markapur: కేసుల భారం తగ్గడమే టార్గెట్.. మార్కాపురంలో కొత్త కోర్టు ప్రారంభం!
Markapur: మార్కాపురం పట్టణంలోనీ న్యాయవ్యవస్థ బలోపేతానికి మరో ముఖ్యమైన అడుగు పడింది. 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కార్యాలయాన్ని హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కోర్టు ప్రారంభోత్సవాన్ని నిర్వహించిన ఆయన, ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా హైకోర్టు న్యాయమూర్తులు ఐ రిక్వెస్ట్ వై లక్ష్మణ్ రావు, జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు,మార్కాపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ
న్యాయమూర్తులు పెండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరిస్తూ ప్రజలకు త్వరిత న్యాయం అందిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా కేసుల భారం తగ్గించేందుకు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోర్టుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన సహకారం అందిస్తున్నాయని స్పష్టం చేశారు. మార్కాపురం కోర్టు ప్రాంగణాన్ని హైకోర్టును తలపించే విధంగా అభివృద్ధి చేసిన న్యాయమూర్తులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఈ చర్యలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.




