Tanguturi: కలెక్టరేట్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు!
Tanguturi: నెల్లూరు కలెక్టరేట్‌లో ఆంధ్రా కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు - డీఆర్ఓ విజయ్ కుమార్!
Tanguturi: కలెక్టరేట్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు!
Tanguturi: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ..
టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహోన్నత నాయకుడని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యసాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
1921లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు తన న్యాయవాద వృత్తిని త్యజించి జాతీయోద్యమంలోకి ప్రవేశించిన ప్రకాశం పంతులు, ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురు నిలిచి ధైర్యాన్ని ప్రదర్శించినందుకు ఆయనకు ‘ఆంధ్రకేసరి’ బిరుదు లభించిందని పేర్కొన్నారు.
1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో రౌడీలు, పోలీసుల కాల్పులకు భయపడకుండా ఎదురు నిలిచి నిలిచిన ఆయన ధైర్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ప్రజాసేవ, దేశభక్తి, నిస్వార్థ నాయకత్వానికి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.




