Markapuram: మాల అమరవీరుల త్యాగం చిరస్మరణీయం దళిత హక్కుల పరిరక్షణ సమితి!
Markapuram: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ త్యాగాలు చిరస్మరణీయమని నీలం నాగేంద్రరావు అన్నారు.
Markapuram: మాల అమరవీరుల త్యాగం చిరస్మరణీయం దళిత హక్కుల పరిరక్షణ సమితి!
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో అమరులైన పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ త్యాగం చిరస్మరణీయమని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు.
మంగళవారం మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో మాల అమరవీరుల 29వ స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన మాల వీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలల హక్కులకు భంగం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు కూడా తమ సామాజిక వర్గం హక్కుల కోసం పార్లమెంట్‌లో గళం వినిపించాలని కోరారు.
అంతకుముందు మార్కాపురం కోర్టు సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, నూతలపాటి రాజు, కల్వకూరి అబ్రహం, గొట్టిముక్కల యోహాన్, రామాంజనేయులు, మహిళా నాయకులు డొక్కా దానమ్మ, కూకట్లపల్లి శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.




