Markapuram : వెలుగొండ నిర్వాసితుల నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్!

Markapuram : సుంకేసుల వెలుగొండ పునరావాస కేంద్రంలో తాగునీటి సమస్యపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తక్షణమే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Sept 2026 4:43 PM IST
Markapuram
X

Markapuram : వెలుగొండ నిర్వాసితుల నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే చంద్రశేఖర్!

మార్కాపురం జిల్లా: పెద్దారవీడు మండలం సుంకేసుల పునరావాస కేంద్రంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న వెలిగొండ నిర్వాసితులు తమ సమస్యను ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తన వ్యక్తిగత సిబ్బందిని పునరావాస కేంద్రానికి పంపించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ట్యాంకర్ల ద్వారా నిర్వాసితులకు తాగునీటిని సరఫరా చేశారు.

నిర్వాసితులకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సుంకేసుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి నీటి సరఫరా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కు నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story