Markapuram: ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ బర్త్‌డే వేడుకలు

Markapuram: ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు వైష్ణవి గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 May 2026 7:28 PM IST
Markapuram
X

Markapuram: ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ బర్త్‌డే వేడుకలు

Markapuram: మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రగొండపాలెంలోని వైష్ణవి గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయ సభలా కాకుండా అభిమానుల ప్రేమాభిమానాల ప్రతీకగా నిలిచింది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో వైష్ణవి గార్డెన్స్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యే ఆదేశాలు లేకపోయినా, ఆయనపై ఉన్న అభిమానంతో నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించడం విశేషం.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ర్యాలీలు, కటౌట్లు, ప్లెక్సీలు, భారీ హెర్డింగ్‌లతో పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టి సామాజిక సేవలో కార్యకర్తలు ముందుండారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యం నింపారు. “ఇబ్బందులు పడుతున్న ప్రతి కార్యకర్తకు త్వరలో స్వర్ణయుగం వస్తుంది. అధైర్యపడొద్దు. మనకు జగనన్న అండగా ఉన్నాడు” అని తెలిపారు. గ్రామాల్లో వైఎస్సార్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నాయకులను గుర్తుంచుకోవాలని, భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే ప్రసంగం సందర్భంగా కార్యకర్తల హర్షధ్వానాలతో వైష్ణవి గార్డెన్స్ సభా ప్రాంగణం మార్మోగింది. ఈ వేడుకలు ఎర్రగొండపాలెంలో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపాయి.

కనిగిరి వైసీపీ ఇంచార్జ్ దద్దనాల నారాయణ యాదవ్, రాష్ట్ర ఇరిగేషన్ మాజీ డైరెక్టర్,మాజీ జడ్పీటీసీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏరువా సేనా రెడ్డి, షేక్ బుజ్జి, 5 మండలాల ఎంపీపీలు, జడ్పిటిసి లు, మండల కన్వీనర్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story