Markapuram: సీఎం చంద్రబాబు ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే నారాయణరెడ్డి పూజలు!

Markapuram: సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని, వెలిగొండ ప్రాజెక్టు నీరు త్వరగా రావాలని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Aug 2026 1:01 PM IST
Markapuram
X

Markapuram: సీఎం చంద్రబాబు ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే నారాయణరెడ్డి పూజలు!

Markapuram: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మార్కాపురం ప్రాంతం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుతూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా వెలిగొండ ప్రాజెక్టు నుంచి వెలిగొండ సాగర్‌కు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి సుమారు రూ.3,000 కోట్లతో పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు.

వెలిగొండ నీరు విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రాంతం సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వినుకొండ టిడిపి పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు గుంటక సుబ్బారెడ్డి ,పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story