Komarolu: రూ.80 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

Komarolu: కొమరోలు మండలం ముత్రాసుపల్లెలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 1 Sept 2026 7:27 PM IST
Komarolu
X

Komarolu: రూ.80 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!

Komarolu: మార్కాపురం జిల్లా , కొమరోలు మండలం తాటిచెర్ల పంచాయతీ ముత్రాసుపల్లె గ్రామంలో రూ.50 లక్షలతో ఒంగోలు హైవే రోడ్డు నుంచి ముత్రాసుపల్లె గ్రామానికి నిర్మించిన రహదారి , అలాగే రూ.30 లక్షల రూపాయలతో గ్రామంలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించారు.

మా చిరకాల కోరిక త్వరితగతిన నెరవేర్చిన శుభ సందర్భంగా పంచాయతీ , గ్రామ నాయకులు , మహిళలు ప్రజలు ఎమ్మెల్యే గారికి బాణాసంచా పేలుస్తూ,శాలువా పూల మాలతో, కర్పూర హారతి ఇచ్చి సాగర స్వాగతం పలికారు

అనంతరం ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రోడ్లు,రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ముత్రాసుపల్లె గ్రామ ప్రజల చిరకాల అవసరాలను గుర్తించి రోడ్డు,రహదారి పూర్తి చేసి అభివృద్ధి చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపి శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు , గ్రామస్థులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story