Giddalur: ఆపన్న హస్తం: 85 మందికి రూ. 55.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Giddalur: నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ. 55,15,730 విలువైయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు.
Giddalur: ఆపన్న హస్తం: 85 మందికి రూ. 55.15 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 85 మందికీ 21 వ విడతగా మంజూరు అయిన, రూ 55,15,730 - 00 లు (అక్షరాల యాభై ఐదు లక్షల పదహైదు వేల ఏడువందల ముప్పై రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి , చెక్కులను అందచేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చునన్నారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 1160 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 10,79,34,309-00 లు (అక్షరాల పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు.
ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ లు, ZPTC లు , మండల పార్టీ అధ్యక్షులు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.




