Cumbum: కంభంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

Cumbum: కంభం పట్టణంలో ఎస్బీఐ సర్కిల్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 2 Sept 2026 9:14 PM IST
Cumbum
X

Cumbum: కంభంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

కంభం: మార్కాపురం జిల్లా,, గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలోని SBI బ్యాంక్ సెంటర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కేక్ కట్ చేసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మార్పుకోసం జెనసేన పార్టీ పెట్టిన వ్యక్తి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2014 లో పార్టీ స్థాపించి 12 సంవత్సరాల పాటు 2024 లో దూరంకరం, దౌర్జన్యం, పెత్తందారి వ్యవస్థలకు వ్యతిరేకంగా NDA కూటమితో భాగస్వామిగా తెలుగుదేశం, బీజేపీ, జెనసేన ఏర్పడి ఈ కూటమితోనే మార్పు వస్తుందని ప్రజా పరిపాలన గా ఉంటుంది అని ఆకాంక్షించిన వ్యక్తి 164 స్థానాలు ఇవ్వడం జరిగింది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సుపరిపాలన అందిస్తున్నారు , పశ్చిమ ప్రకాశంగా ఉన్న జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది అని రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అభినందనీయమని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గం జెనసేన ఇంచార్జీ బెల్లంకొండ సాయి బాబా,కంభం జెనసేన మండలం పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, నరిశెట్టి వీరమ్మ,కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story