Dornala: వెలిగొండ పనుల్లో వేగం టన్నెల్‌లోకి మంత్రి నిమ్మల!
Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Dornala: వెలిగొండ పనుల్లో వేగం టన్నెల్‌లోకి మంత్రి నిమ్మల!
దోర్నాల: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. టన్నెల్స్‌లో ఐదు గ్యాంట్రీలతో జరుగుతున్న లైనింగ్ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. పనులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టన్నల్ లోపల 12 కిలోమీటర్ల వద్ద ఉన్న టీబీఎం మిషన్ను తొలగించేందుకు హైకోర్టు ఆదేశం ఇచ్చిందని టీబీఎం మిషన్ను తీసివేసినట్లయితే నీరు అందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. పరిశీలన అనంతరం కొల్లం వాగు వద్ద బస చేసిన మంత్రి, ఉదయం 9 గంటలకు టన్నెల్స్ నుండి బయటకు రానున్నారు.
Next Story




